వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్

వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మంచి యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. కరోనా నేపధ్యంలో ప్రజలలో తన వంతు ధైర్యాన్ని నింపుతూనే, అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మంచి పనులపై ప్రశంసలు కురిపిస్తున్నాడు.

అయితే మొన్న నన్ను త్వరగా అర్థం చేసుకోక పోయినా పర్వాలేదు కానీ దయచేసి అతి త్వరగా చెప్పుడు మాటలు విని అపార్థం మాత్రం చేసుకోవద్దు అంటూ తన అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్న బండ్ల గణేశ్ మరో సారి తన గురుంచి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నా పై వచ్చే విమర్శలు నేను ఎప్పుడు చదవను ఎందుకంటే అవి నేనంటే నచ్చని వారు రాసినవి, నేనేంటో నాకు తెలుసు. నా అభిప్రాయాన్ని రాస్తూ ఉంటా నేను ఎవరికీ బానిసని కాదు అంటూ చెప్పుకొచ్చాడు.