మరపురాని ఘటనను పంచుకున్న మెగాస్టార్

మరపురాని ఘటనను పంచుకున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియా లోకి వచ్చి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ తో పాటుగా తన మరపురాని సంఘటనలను కూడా కొన్ని తన ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు. అలాగే ఈ మధ్యన మెగాస్టార్ ఏం చెప్పినా సోషల్ మీడియాలో మంచి ఫన్నీ ట్రోల్స్ వేస్తున్నారు.

తాను ఇప్పుడు నటిస్తున్న “ఆచార్య” సినిమా విషయంలో టైటిల్ లీక్ చేసారని ఊపందుకున్న ట్రోల్స్ నిన్నటి వరకు కొనసాగాయి. తన ట్విట్టర్ ఖాతా ద్వారా చిరు ఏమన్నా సస్పెన్స్ తో కూడిన ట్వీట్ చేసినా దానిపై సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ వేశారు.

అలా నిన్న తాను ఒక వీడియో పెట్టబోతున్నానని మ్యూజిక్ కు సంబంధించి పెడతా అని చెప్పడంతో మళ్ళీ ఏదో లీకు చేస్తున్నారని ఫన్నీ ట్రోల్స్ వేశారు. కానీ చిరు తన ఇంట్లోనే తన మానవరాళితో జరిగిన ఒక మరపురాని ఘటనను పంచుకున్నారు.

చిన్న పాపాయితో తాను నటించిన “ఖైదీ నెం 150” లోని పాట పెట్టి ఎంజాయ్ చేసిన గత ఏడాది వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో చూస్తే మాత్రం ఎవరైనా యిట్టె కుదుటపడటం ఖాయం అని చెప్పాలి. దీనితో తనపై వేసే ఫన్నీ ట్రోల్స్ కు చిరు ఇలా అడ్డుకట్ట వేశారని చెప్పాలి.