‘యూ ఆర్‌ ఏ సూపర్‌ హీరో’ అని చెప్పిన బేర్‌ గ్రిల్స్‌

‘యూ ఆర్‌ ఏ సూపర్‌ హీరో’ అని చెప్పిన బేర్‌ గ్రిల్స్‌

ప్రముఖ సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సాహసయాత్రకు దిగాడు. అతనితో సమానంగా కొండలు, గుట్టలు ఎక్కుతూ దిగుతూ సాహసాలకు పూనుకున్నాడు. డెబ్భైఏళ్ళ వయసులోనూ రజనీ అంత చురుకుగా, చలాకీగా పరుగెత్తుతూ కనిపించడం బేర్‌గ్రిల్స్‌నే ఆశ్చర్యపరిచింది. అతని శక్తియుక్తులను కళ్లారా చూశాక.. పొగడకుండా ఉండలేకపోయాడు. ‘యూ ఆర్‌ ఏ సూపర్‌ హీరో’ అని ప్రశంసించాడు. అంతేకాక ‘రజనీ.. అతనిపై విసిరిన ప్రతి చాలెంజ్‌ను స్వీకరించాడు’ అంటూ ‘ఇన్‌టూ ద వైల్డ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌’ రెండో టీజర్‌ను బేర్‌ గ్రిల్స్‌ విడుదల చేశాడు. (ర‌జ‌నీకాంత్ వ‌ర్సెస్ బేర్ గ్రిల్స్‌)ఈ అడ్వెంచర్‌ యాత్రకు సంబంధించిన షూటింగ్‌ కర్ణాటకలోని బండీపూర్‌ అభయారణ్యంలో జరుపుకోగా పూర్తి కార్యక్రమం డిస్కవరీ చానెల్‌లో మార్చి 28న ప్రసారం కానుంది.