ఓటీటీలోకి ‘బెదురులంక’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఓటీటీలోకి ‘బెదురులంక’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Movie News

బెదురులంక 2012 : కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బెదురు లంక 2012’ ప్రేక్షకుల ముందుకు ఇటీవలే వచ్చేసింది. కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ను లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు.

ఓటీటీలోకి ‘బెదురులంక’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Bedurulanka 2012

క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సి.యువరాజ్ చిత్ర సమర్పకులుగా వ్యవహరించారు. క్లాక్స్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, హీరోయిన్ నేహా శెట్టి జంటగా నటించిన మూవీ ‘బెదురులంక 2012’. ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా… ఎలాంటి ప్రకటన ఏమి లేకుండా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ లో ఇవాల్టి నుంచి ఈ సినిమా అందుబాటులో ఉంది. థియేటర్లలో అంతగా అలరించని ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.