“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” టీజర్ రిలీజ్ కి టైం ఫిక్స్ ..ఎప్పుడంటే ..!

Time fix for "Gangs of Godavari" teaser release ..when ..!
Time fix for "Gangs of Godavari" teaser release ..when ..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ నే “గామి” తో తన కెరీర్ లో మరో మంచి హిట్ ను అందుకోగా ఈ మూవీ తర్వాత తన నుంచి రానున్న ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ నే “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ మూవీ పై ఇది వరకే మంచి బజ్ నెలకొన్నది .

Time fix for "Gangs of Godavari" teaser release ..when ..!
Time fix for “Gangs of Godavari” teaser release ..when ..!

పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అన్నీ కూడా సాలిడ్ రెస్పాన్స్ ను అందుకోగా ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఈ మూవీ టీజర్ ను ఈ ఏప్రిల్ 27న సాయంత్రం 4 గంటల 1 నిమిషానికి అయితే లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు ఫిక్స్ చేశారు.

 

ఒక లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ టీజర్ ను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించగా ఇంకా వేదిక ఏంటి ఎక్కడ అనే వివరాలు కూడా రావాల్సి ఉన్నాయి. ఇక ఈ మూవీ లో నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా నటించగా రీసెంట్ సెన్సేషన్ అయేషా ఖాన్ (Ayeshaa Khan) స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు