విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లేటెస్ట్ న్యూస్ ..!

విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లేటెస్ట్ న్యూస్ ..!
Cinema News

యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా యువ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. వాస్తవానికి డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనంతరం మార్చి 8 కి వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఒక సాంగ్ అందరినీ ఆకట్టుకుని సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ మూవీ స్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ ప్రకారం ప్రస్తుతం ప్రొడక్షన్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా ఈ నెలాఖరు కల్లా షూట్ మొత్తాన్ని పూర్తి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సినిమా కి సంబంధించి ప్రమోషన్స్ లో హీరో విశ్వక్ సేన్ సహా ఇతరులు పాల్గొననున్నారంట . మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతము చేసుకుంటుందో చూడాలి.