TS Politics: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్ విడుదల.. గుండె కొట్టుకోవడంలో

TS Politics: Tammineni Veerabhadram health bulletin release.. in heartbeat
TS Politics: Tammineni Veerabhadram health bulletin release.. in heartbeat

Cpm తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్‌ విడుదల అయింది ఏఐసీ ఆసుపత్రి సిబ్బంది. ప్రస్తుతం నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం ఉందని వైద్యులు పేర్కొన్నారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని… ఆయ మెడిసిన్స్ కు స్పందిస్తున్నారు కాబట్టి స్పీడ్ రికవరీ కనిపిస్తుందని వైద్యులు స్పష్టం చేసింది ఏఐసీ ఆసుపత్రి సిబ్బంది.

బీపీ, పల్స్ లెవెల్స్ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని…తాను స్వయంగా 50శాతానికి పైగా శ్వాస తీసుకుంటున్నారని వివరించింది ఏఐసీ ఆసుపత్రి సిబ్బంది. దీంతో ఇవ్వాళ వెంటిలేటర్ సహాయాన్ని తొలగించే అవకాశం ఉందని తెలిపింది. కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది.. గుండె కొట్టుకోవడంలో కూడా కొంత మార్పులు వచ్చాయని అంటున్నారు వైద్యులు. కాగా మంగళవారం రోజున సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర కు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే.