ఓటిటిలో “మంజుమ్మల్ బాయ్స్” ఎంట్రీపై లేటెస్ట్ అప్డేట్ ..!

Latest update on “Manjummal Boys” entry in OTT ..!
Latest update on “Manjummal Boys” entry in OTT ..!

టాలెంటెడ్ నటీనటులు సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్ తదితర నటులు ముఖ్య పాత్రల్లో దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన లేటెస్ట్ సర్వైవల్ మూవీ “మంజుమ్మల్ బాయ్స్”. మళయాళంలో ఇండస్ట్రీ హిట్ అయ్యిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించి హిట్ అయ్యింది. అయితే ఈ మూవీ ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న వారికి హాట్ స్టార్ వారు రీసెంట్ గానే అతి త్వరలో అఫీషియల్ గా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు .

Latest update on “Manjummal Boys” entry in OTT ..!
Latest update on “Manjummal Boys” entry in OTT ..!

ఇక ఇప్పుడు మరో అప్డేట్ ను వారు అందించారు. ఈ మూవీ ఓటిటిలో పాన్ ఇండియా భాషల్లో రానున్నట్టుగా తెలిపారు. ఇక రిలీజ్ ఎప్పుడు అనేది తేదీ రివీల్ చేయడమే ఆలస్యం అని చెప్పాలి . మరి పాన్ ఇండియా భాషల్లో ఈ మూవీ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ మూవీ కి సుసీన్ శ్యామ్ సంగీతం అందించగా తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు తెలుగులో రిలీజ్ కు తీసుకొచ్చారు.