పదిరోజులైనా తగ్గని జోరు : ‘మంజుమ్మల్ బాయ్స్’

'Manjummal Boys', a force that doesn't decrease even after ten days
'Manjummal Boys', a force that doesn't decrease even after ten days

ఇటీవల మలయాళ ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకుని అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సర్వైవల్ థ్రిల్లర్ జానర్ సినిమా మంజుమ్మల్ బాయ్స్. చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ని పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని గ్రాండ్ గా నిర్మించారు. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న స్నేహితుడిని రక్షించిన మంజుమ్మెల్ అనే గ్రామానికి చెందిన యువకుల నిజజీవిత అనుభవం ఆధారంగా రూపొందించబడిన ఈ ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా లో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువాల్, లాల్ జూనియర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

'Manjummal Boys', a force that doesn't decrease even after ten days
‘Manjummal Boys’, a force that doesn’t decrease even after ten days

ఇక ఈ సినిమా ని ఏప్రిల్ 6న తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు తెలుగులో దీనిని రిలీజ్ చేయడం జరిగింది. మొదటి షోతోనే తెలుగులో కూడా ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రెండు రోజుల్లోనే ఈ సినిమా కి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇంకా జోరు చూపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయి పది రోజులు అవుతున్నప్పటికీ కూడా చాలా ఏరియాల్లో మంజుమ్మల్ బాయ్స్ బాగానే కలెక్షన్ రాబడుతోంది. మరి మొత్తంగా ఈ సినిమా తెలుగులో ఎంతమేర రాబడుతుందో చూడాలి.