‘మంజుమ్మల్ బాయ్స్’ :అక్కడ లాగానే ఇక్కడ కూడా అదరగొట్టనుందా ?

'Manjummal Boys': Will it be a hit here like there?
'Manjummal Boys': Will it be a hit here like there?

ఇటీవల మలయాళంలో రూపొంది అక్కడ అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సర్వైవల్ థ్రిల్లర్ సినిమా మంజుమ్మల్‌ బాయ్స్. సౌబిన్‌ షాహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌ బాసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కి చిదంబరం ఎస్‌ పొదువల్‌ దర్శకత్వం వహించారు. నేడు ఈ సినిమా ని తెలుగు ప్రేక్షకులు ముందుకి తీసుకువస్తున్నారు. కాగా ఈ సినిమా ని తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తారని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.

'Manjummal Boys': Will it be a hit here like there?
‘Manjummal Boys’: Will it be a hit here like there?

పరవ ఫిలింస్‌ బ్యానర్ పై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక ఈ సినిమా ని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు . ఇప్పటికే ఈ సినిమా యొక్క పెయిడ్ ప్రీమియర్స్ కు అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. ఇక పెయిడ్ ప్రీమియర్స్ కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అటు మలయాళం మాదిరిగా ఈ సినిమా ఇటు తెలుగులో కూడా బాగా కలెక్షన్ రాబట్టే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.