దసరా ముందు నా సత్తా ఏంటో చూపిస్తా – బాలకృష్ణ

దసరా ముందు నా సత్తా ఏంటో చూపిస్తా – బాలకృష్ణ
Latest News

నట సింహం బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో బాలయ్య మాట్లాడారు. ఇంతకీ, బాలయ్య ఏం మాట్లాడారు అంటే.. ‘‘పోరాటాల పురిటి గడ్డగా పేరొందిన వరంగల్‌ ప్రజలు, నా అభిమానులందరికీ అభినందనలు. నాకు వరంగల్‌తో అనుబంధం ఉంది. దసరా నవరాత్రులకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆ భద్రకాళి అమ్మవారే నన్ను ఇక్కడికి రప్పించారనుకుంటున్నాను .

దసరా ముందు న సత్తా అంతో చూపిస్తా  – బాలకృష్ణ
Balakrishna

సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మలాంటి ఎందరో పోరాట యోధులను స్మరించుకుంటున్నా. పెండ్యాల రాఘవయ్య వరంగల్‌ ఎంపీగా, హనుమకొండ ఎమ్మెల్మేగా, వర్దన్నపేట ఎమ్మెల్యేల గా గెలిచారు. అలాగే 1984లో నాన్న (నందమూరి తారక రామారావు) గుడివాడ, హిందూపూర్‌, నల్గొండ నుంచి పోటీ చేసి, మూడు చోట్లా కూడా విజయం సాధించారు. నేను ఈ సినిమాలో తెలంగాణ మాండలికంలో సంభాషణలు చెప్పా. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనమున్న సినిమాలు అందించాలనేదే నా తాపత్రయం. దసరా ముందు దంచుదాం. కొత్త మూవీ చేసేముందు నేను నా పాత చిత్రాల గురించి దర్శకులతో చర్చించను. ప్రతి సినిమాని సవాలుగా స్వీకరిస్తా. చరిత్రలో నిలిచిపోయే సినిమా లు నేను చేయగలిగానంటే దానికి కారణం ఆయా సినిమా బృందాల సమష్టి కృషి’’ అని బాలయ్య చెప్పుకొచ్చాడు.