క్లైమాక్స్ ఫైట్ వీడియో రిలీజ్ చేసిన..‘భగవంత్ కేసరి’ టీం

‘భగవంత్ కేసరి’ : క్లైమాక్స్ ఫైట్ వీడియో రిలీజ్...
Cinema News

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలేక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా లో యువ దర్శకడు అనిల్ రావిపూడి తెరకెక్కించగా థమన్ సంగీతం అందించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో నిర్మితం అయిన భగవంత్ కేసరి నేటితో సక్సెస్ఫుల్ గా మూడవ వారంలోకి అడ్గుగుపెట్టి ఇంకా పలు ప్రాంతాల్లో మంచి కలెక్షన్ ని సొంతం చేసుకుంటోంది.

‘భగవంత్ కేసరి’ : క్లైమాక్స్ ఫైట్ వీడియో రిలీజ్...
Balakrishna ” Bhagavanth Kesari “

video : https://youtu.be/Cbf-HEFK4NQ

తమన్ సంగీతం అందించిన ఈ సినిమా లోని సాంగ్స్, బీజీఎమ్ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇక బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు యాక్షన్ బ్లాక్స్, ఫైట్స్ కి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది . విషయం ఏమిటంటే, ఈ సినిమా లో క్లైమాక్స్ బ్లాక్ కి మరింత మంచి పేరు లభించగా దాని యొక్క మేకింగ్ వీడియోని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో ఆడియన్స్ నుండి మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటోంది. మరి భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద ఇంకెంతమేర కలెక్షన్ ని కొల్లగొడుతుందో చూడాల్సి ఉంది .