Election Updates: కాంగ్రెస్ నేత జానారెడ్డికి ఊహించని షాక్.. ఇంట్లో ఐటీ సోదాలు

Election Updates: Unexpected shock for Congress leader Jana Reddy.. IT searches at home
Election Updates: Unexpected shock for Congress leader Jana Reddy.. IT searches at home

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 18 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అంతే కాదు ఐటీ అధికారుల తనిఖీలు మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో జరుగుతున్నాయి.

జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపారానికి సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరణ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత కేఎల్ఆర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే ఐటీ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. అటు హైదరాబాద్‌ బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాత ఇంట్లో ఐటీ సోదాలు ముగిసాయి. నిన్న ఉదయం నుంచి ఐటీ అధికారులు పారిజాత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ పారిజాత, నరసింహారెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.