మెగాస్టార్ కి విలన్ గా భల్లాలదేవ ?

మెగాస్టార్ కి విలన్ గా భల్లాలదేవ ?
Cinema News

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఆయన కెరీర్ 156వ మూవీ తాజాగా గ్రాండ్ లెవల్లో పూజా కార్యక్రమాలతో మొదలైన విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ సంస్థ పై భారీ స్థాయిలో వంశీ, ప్రమోద్ నిర్మించనున్న ఈ మూవీ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందనుండగా కీరవాణి సంగీతాన్ని, చోట కె నాయుడు ఫోటోగ్రఫిని అందించనున్నారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కి సంబంధించి ప్రస్తుతం ఒక క్రేజీ న్యూస్ అయితే టాలీవుడ్ లో బజ్ గా ప్రచారం అవుతోంది.

మెగాస్టార్ కి విలన్ గా భల్లాలదేవ ?
Mega 156

దాని ప్రకారం ఈ సినిమా లో విలన్ గా దగ్గుబాటి రానా కనిపించనున్నారని అంటున్నారు. బాహుబలి సిరీస్ లోని రెండు మూవీ ల్లో భళ్లాలదేవుని పాత్రలో అత్యద్భుతంగా పెర్ఫార్మన్స్ కనబరిచి అందరినీ ఆకట్టుకున్న రానా, ఈ సినిమా లో మరింత క్రూరమైన పాత్రలో కనిపినించనున్నారట. హాలీవుడ్ మార్వెల్ కామిక్స్ లోని లోకి పాత్ర మాదిరిగా ఈ సినిమా లో రానా పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దారట దర్శకుడు వశిష్ట. కాగా ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.