బాలీవుడ్‌కు భరత్‌..?

Bharat Ane Nenu movie Remake in Bollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన భరత్‌ అనే నేను చాలా సింపుల్‌గా 100 కోట్ల కలెక్షన్స్‌ను క్రాస్‌ చేసి 200 కోట్ల వైపుకు దూసుకు పోతుంది. ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందనే విషయం దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రంలో చూపించాడు. రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రంను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబు నటించి పలు చిత్రాలు గతంలో ఇతర భాషల్లో రీమేక్‌ అయ్యాయి. తాజాగా ఈ చిత్రంను కూడా రీమేక్‌ చేయడం ఖాయం అనే టాక్‌ వస్తుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ ‘భరత్‌ అనే నేను’ చిత్రం రీమేక్‌ రైట్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముంబయి నుండి వచ్చిన ప్రతినిధులు నిర్మాత దానయ్యతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే రీమేక్‌ విషయమై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ బాలీవుడ్‌ హీరోతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సదరు సంస్థ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి ఈ కథ దగ్గరగా ఉందని, తప్పకుండా హిందీలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.