ఓటీటీలోకి వచ్చేసిన ‘భోళా శంకర్‌’.. ఎందులో చూడొచ్చంటే?

ఓటీటీలోకి వచ్చేసిన ‘భోళా శంకర్‌’.. ఎందులో చూడొచ్చంటే?
Movie News

చిరంజీవి హీరోగా చేసిన ‘భోళాశంకర్‌’ సినిమా. ఓటీటీలోకి వచ్చేసింది. ఈమధ్య థియేటర్​లో సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయో లేదో కొద్దిరోజులకే అలా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. హిట్ సినిమాలు రావడానికి కాస్త సమయం పడుతోంది కానీ థియేటర్​లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ మూవీ లు మాత్రం చాలా త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీలోకి వచ్చేసిన ‘భోళా శంకర్‌’..  ఎందులో చూడొచ్చంటే?
Chiranjeevi

తాజాగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నది . వేదాళం సినిమా కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో డిజాస్టర్ గా నిలిచినప్పటికీ చిరంజీవి టైమింగ్, డ్యాన్స్, నటన బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ లో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల లో నటించారు. ఇక థియేటర్‌ లో చూడని వారు.. ఓటీటీలో భోళాశంకర్ సినిమా చూసేయండని చిత్ర బృందం కోరింది.