ఓటీటీలోకి భోళాశంకర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఈమధ్య థియేటర్​లో సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయో లేదో కొద్దిరోజులకే అలా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. హిట్ మూవీ లు రావడానికి కాస్త సమయం పడుతోంది కానీ థియేటర్​లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ మూవీ లు మాత్రం చాలా త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా భోళా శంకర్ కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 15 నుంచి ఇది సినీ ప్రియులకు అందుబాటులో కి రానున్నది . తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ అవ్వనున్నది .

ఓటీటీలోకి భోళాశంకర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? - Telugu Bullet

సిస్టర్ సెంటిమెంట్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘భోళా శంకర్‌’ సినిమాను మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి సోదరిగా నటి కీర్తి సురేశ్‌ ప్రముఖ పాత్ర పోషించారు. తమన్నా కథానాయికగా నటించింది. ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కాగా, ఇప్పుడు ఈ .. చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఇంకెందుకు ఆలస్యం.. మెగాస్టార్ ఫ్యాన్స్ ఈనెల 15వ తేదీన ఓటీటీలో భోళాశంకర్ సినిమా చూసేయండి.