నా సహవాసులందరికీ బిగ్ థ్యాంక్స్ : బోయపాటి

టాలీవుడ్ లో బి.గోపాల్, వి.వి.వినాయక‌ల తర్వాత ఔట్ అండ్ ఔట్ మాస్ డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను. అయితే ఆ సినిమా పరిశ్రమలోకి వచ్చి సరిగ్గా ఈరోజుకి 15ఏళ్లు పూర్తయింది. పదిహేనేళ్ల క్రితం ఈరోజు బోయపాటి శ్రీను తన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను అభిమానులను ఉద్దేశిస్తూ.. ఓ లెటర్ రాసారు. ‘ఇదే రోజు పదిహేనేళ్ల క్రితం ఎన్నో కలలతో సినీ పిరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఎన్నో ఆశలు, ఆశయాలతో అడుగుపెట్టిన నేను ఊహించిన దాని కంటే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువే పొందాను. నా మార్గంలో నేను కలిసిన ప్రతి వ్యక్తి కారణంగానే ఇది సాధ్యమైంది. ఈ సందర్భంగా నేను పనిచేసిన హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీకు ఎప్పుటికీ రుణపడి ఉంటాను. మీరు అందించిన ప్రోత్సాహం, సహాయ సహకారాలకు నేను ఎప్పటికీ మరవలేను. త్వరలోనే నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను’ అంటూ ఒకింత భావోద్వేగానికి లోనై పోస్ట్ చేశారు బోయపాటి శ్రీను. అది ఇప్పుడు వైరల్ గా మారింది.