బిగ్‌బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌కు స్పెషల్‌ గెస్ట్‌…!

Bigboss Telugu Final Episode Special Guests Nagarjuna

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 మరికొన్ని రోజుల్లో ముగియబోతుంది. నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. వివాదాలు, విమర్శల నడుమ మొదటి నుండి కూడా మంచి టీఆర్పీ రేటింగ్‌ వచ్చినట్లుగా స్టార్‌ మా వర్గాల వారు అంటున్నారు. నాని హోస్టింగ్‌ విషయంలో మొదట విమర్శలు వచ్చినా కూడా ఆ తర్వాత అవి కనిపించకుండా పోయాయి. కౌశల్‌ ఆర్మీ ఈ సీజన్‌ మొత్తంను లీడ్‌ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కౌశల్‌ అభిమానులు ఎవరు ఎలిమినేట్‌ కావాలంటూ పిలుపునిస్తే వారు ఎలిమినేట్‌ అయ్యారు. మొదటి నుండి కూడా చూసుకుంటే కౌశల్‌తో గొడవ పడ్డవారు ఒక్కరు ఒక్కరుగా వెళ్లి పోయారు. ఇక ఈ సీజన్‌ ఫైనల్‌ విజేత ఎవరు అనే టైం దగ్గరకు వచ్చింది.

bigboss-nagarjuna

మొదటి సీజన్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ రోజు ముఖ్య అతిథిగా ఒక స్టార్‌ హీరో రాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కాని ఎన్టీఆర్‌ ఒక స్టార్‌ హీరో, ఆ హీరోతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు మరో స్టార్‌ హీరో ఆసక్తి చూపించలేదు. అందుకే మొదటి సీజన్‌కు గెస్ట్‌ ఎవరు లేరు. కాని రెండవ సీజన్‌కు మాత్రం ఖచ్చితంగా ఒక గెస్ట్‌ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆగెస్ట్‌ మరెవ్వరో కాదు కింగ్‌ నాగార్జున. మా టీవీలో ఒకప్పుడు సహ భాగస్వామిగా ఉన్న నాగార్జున ఇప్పటికి కూడా స్టార్‌ మాతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. అందుకే బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఫైనల్‌ ఎపిసోడ్‌లో కనిపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగార్జున మరియు నానిలు కలిసి ఫైనల్‌ విజేత ఎవరు అనే విషయాన్ని ప్రకటించి షీల్డ్‌ మరియు క్యాష్‌ ప్రైజ్‌ను ఇవ్వబోతున్నారు.

bigboss