బిగ్‌ బాస్‌ షాక్‌ అయ్యేన్ని ఓట్లు…!

Bigg Boss Kaushal Vote Is Shocking In This Week

తెలుగు బుల్లి తెరను షేక్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ షో రేపటితో పూర్తి కాబోతున్న విషయం తెల్సిందే. ఫినాలే వారంలో కౌశల్‌, తనీష్‌, సామ్రాట్‌, గీతామాధురి, దీప్తిలు ఉన్నారు. ఈ అయిదుగురిలో అంతా కూడా కౌశల్‌ గెలవడం ఖాయం అంటున్నారు. కౌశల్‌కు ఏర్పడిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కారణంగా రికార్డు స్థాయిలో ఓట్లు పడుతున్నాయి. భారీ ఎత్తున కౌశల్‌కు ఓట్లు దక్కుతున్న కారణంగా ఆయనే విజేత అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఇక బిగ్‌ బాస్‌ చరిత్రలో ఎప్పుడు రానన్ని ఓట్లు ఈ ఫినాలేకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

big-bass-koushal-samrat-tha

27 కోట్ల ఓట్లు బిగ్‌ బాస్‌ ఫైనల్‌ వారంలో నమోదు అయినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఏ సౌత్‌ బిగ్‌ బాస్‌ షో లో కూడా ఇంతగా ఓట్లు నమోదు కాలేదు. కౌశల్‌ ఆర్మీ ప్రభావంతోనే ఇంత భారీ స్థాయిలో ఓట్లు నమోదు అవుతున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కౌశల్‌ ఆర్మీ మెంబర్స్‌ ప్రతి రోజు కొన్ని లక్షల సంఖ్యలో ఓట్లను వేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఓట్లను చూసి బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కూడా షాక్‌ అవుతున్నారు. రేపటి ఎపిసోడ్‌లో విజేతను ప్రకటించే సమయం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 100 రోజులు అంటూ మొదలు పెట్టి మరో రెండు వారాలను పెంచి మరీ ఈ షోను కొనసాగించిన విషయం తెల్సిందే.

big-boss-geetha-deepthi