యాపిల్ కు భారీ నష్టమే

యాపిల్ కు భారీ నష్టమే

క్యూ3 లో చిప్ కొరత కారణంగా యాపిల్ సుమారు 6 బిలియన్ డాలర్లను కోల్పోయింది. దీంతో పాటు చాలా దేశాల్లో ఫెస్టివల్‌ సీజన్‌ కారణంగా పెరిగిన సేల్స్‌కు అనుగుణంగా ప్రొడక్ట్‌లు లేకపోవడం, చిప్‌ కొరత ఏర్పడడం మరో కారణమని యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తెలిపారు. అదే సమయంలో ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్‌ల కోసం యాపిల్‌ ఐపాడ్‌లతో పాటు మిగిలిన ప్రొడక్ట్‌ల ఉత్పత్తిని తగ్గించింది. ఐఫోన్‌లకు చిప్‌లను అందించింది.

కానీ తాజాగా భారత్‌తో పాటు మిగిలిన దేశాల్లో ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్‌లు తగినంత లేకపోవడం యాపిల్‌ భారీ ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు చిప్‌లు అందుబాటులో ఉంటేనే నష్టాల్ని నివారించ వచ్చనేది మరికొన్ని రిపోర్ట్‌లు నివేదికల్లో పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా చిప్‌ కొరత యాపిల్‌కు పెద్ద దెబ్బేనని, ఆటోమోటివ్ రంగంలో మహమ్మారి, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఏడాది ప్రారంభం నుంచి సెమీకండక్టర్ కొరత ఏర్పడింది. 2023లోపు ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందని ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ అన్నారు.