పారిస్ లో భారీ పేలుడు

పారిస్ లో భారీ పేలుడు

ఫ్రాన్స్‌లో భారీ పేలుడు సంభవించింది. దేశ రాజధానిలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పారిస్‌, దాని చుట్టు పక్కల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. నగరం అంతటా ఈ శబ్దం వినిపించింది అంటే ప్రమాద తీవ్రత ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

అయితే పేలుడు మూలం మాత్రం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియ లేదు. ఓ టీవీ న్యూస్‌ చానెల్‌ రిపోర్టు ప్రకారం యుద్ధ విమానం కూలి పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.