ఐపీఎల్ ఫీవ‌ర్ తో ఊగిపోతున్న దేశం…

Bollywood Stars performance in IPL 2018 Opening Ceremony

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఐపీఎల్… ఐపీఎల్… ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా ఇదే మాట‌. స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం ప్రారంభ‌మై అంత‌కంత‌కూ ప్రేక్ష‌కాద‌ర‌ణను పెంచుకుంటోన్న ఐపీఎల్ 11వ సీజ‌న్ కు రంగం సిద్ధ‌మ‌యింది. దేశ‌మంతా ఐపీఎల్ ఫీవ‌ర్ తో ఊగిపోతోంది. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కాబోతోంది. ఇవాళ్టి నుంచి మే 27వ‌ర‌కు ఐపీఎల్ మ్యాచ్ లు హోరెత్తనున్నాయి. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ప్రారంభ‌వేడుక‌లు మొద‌లుకానున్నాయి. ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ డ్యాన్సుల‌తో క‌నువిందుచేయ‌నున్నారు.

హృతిక్ రోష‌న్, వ‌రుణ్ ధావ‌న్, జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్, త‌మ‌న్నా, ప్ర‌భుదేవా, సింగ‌ర్ మీకా సింగ్ ఆడిపాడ‌నున్నారు. రాత్రి 8గంట‌ల‌కు డిఫెండింగ్ ఛాంపియ‌న్ ముంబై, రెండేళ్ల నిషేధం త‌ర్వాత తిరిగి లీగ్ లో అడుగుపెట్టిన చెన్నై సూప‌ర్ కింగ్స్ తో సొంత‌గ‌డ్డ‌పై త‌ల‌ప‌డ‌నుంది. మ్యాచ్ ల‌ను స్టార్ ఇండియా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఐపీఎల్ ప్రారంభ‌మైన త‌ర్వా త స‌రిగ్గా ప‌దేళ్ల‌కు తొలిసారి… మ్యాచ్ లు స్థానిక భాష‌ల్లో ప్ర‌సారంకానున్నాయి. అలాగే డీడీ స్పోర్ట్స్ లో కూడా ఐదు నిమిషాలు ఆల‌స్యంగా మ్యాచ్ ప్ర‌సార‌మ‌వుతుంది. మొత్తం 8 జ‌ట్లు 51 రోజుల పాటు తొమ్మిదిన‌గ‌రాల్లో 60 మ్యాచ్ లు ఆడ‌నున్నాయి. ఇక ఈ 51 రోజులూ… సినిమా థియేట‌ర్లతో పాటు ఇత‌ర వినోద‌కార్య‌క్ర‌మాల ప్రాంతాలన్నీ వెల‌వెల‌బోక త‌ప్ప‌దు.