హైదరాబాద్‌లో దిగిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్..!

Global star NTR landed in Hyderabad
Global star NTR landed in Hyderabad

టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో మాస్ యాక్షన్ సినిమా దేవర పార్ట్ 1 అలానే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 సినిమా చేస్తున్నారు. ఈ రెండు మూవీ ల పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

Global star NTR landed in Hyderabad
Global star NTR landed in Hyderabad

ఇటీవల తాజా షెడ్యూల్ లో భాగంగా ముంబై లో వార్ 2 కు సంబంధించి ఎన్టీఆర్, హృతిక్ ల పై పలు కీలక సీన్స్ తెరకెక్కించింది యూనిట్. కాగా ఆ షూట్ షెడ్యూల్ ముగించుకుని ఈరోజు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్. ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్ర ఒకింత నెగటివ్ షేడ్స్ తో ఎంతో పవర్ఫుల్ గా ఉండనున్నట్లు ఉంది . ఇక ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.