లవ్ చేయోద్దందని అత్తని టెడ్డీబేర్ తో చంపేశాడు !

Boy Kills his aunty with teddy bear

నేటి సమాజంలో సినిమాలు కీలక రోల్ పోషిస్తున్నాయి, వాటిని చూస్తున్న పిల్లలు వాటినే చూస్తూ అందులో తమను తాము ఊహించుకుంటూ దారుణాలకి ఒడిగడుతున్నారు. తాను ప్రేమిస్తున్న ఎనిమదవ తరగతి చదువుతున్న అత్త కూతురితో మాట్లాడొద్దని అత్త కోపగించుకోవడంతో ఆమెను చంపేసాడు పదవ తరగతి చదువుతున్న ఆమె అల్లుడు. కలలకం రేపుతున్న ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలో ఒక ప్రాంతంలో కిరాణా షాపు నడుపుతున్న శంకర్ సుబ్బు అనే వ్యక్తికి భార్య ఒక కుమారుడు, ఒక కుమార్తె. రెండ్రోజుల క్రితం మధ్యాహ్న సమమయంలో సుబ్బు ఇంటికెళ్ళి చూడగా భార్య మణికట్టు తెగి రక్తపు మడుగులో పడుంది.

దీంతో ఖంగారు పడిన సుబ్బు ఆమెని ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో అది ఆత్మహత్య అని నమ్మని సుబ్బు అసలు ఆమెని ఎవరైనా హత్య చేసారా ? అని తెలుసుకునే క్రమంలో సుబ్బు పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేయించగా అందులో తమిళ్‌ సెల్వి ఆత్మహత్య చేసుకోలేదని గొంతు నులమడంతో ఊపిరాడక మరణించినట్లు తేలింది. ఆమె మరణించాక చేతి మణికట్టుపై గాయం ఏర్పడినట్లు తేలింది.

దీంతో పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దర్యాప్తు జరుపగా అదే ప్రాంతంలో నివసిస్తున్న శంకర్‌సుబ్బు సోదరి కుమారుడు పదో తరగతి చదువుతున్న బాలుడు వచ్చి వెళ్లినట్లు తేలింది. దీంతో ఆ విద్యార్థి ని శనివారం రాత్రి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసుల స్టైల్ లో విచారణ జరిపారు. దీంతో ఆ కుర్రాడు తన అత్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అత్తా కూతురు అంటే తనకు ప్రేమ అని తాను ఆమెతో మాట్లాడడం అత్తకు నచ్చలేదని తనను ఇంటికి రావద్దని ఆమె కోపగించుకోవడంతో ఆగ్రహంతో ఆమెను టెడ్డీబేర్‌తో గనత్ హత్య చేసినట్లు తెలిపారు. ఆ తరువాత మణికట్టుపై కత్తితో కోసినట్లు తెలిపాడు.