అప్పుడు ఎన్టీఆర్ కి రామోజీ…ఇప్పుడు పవన్ కి ఎవరో తెలుసా ?

AP MD mutta gopala krishna joining in pawan's party

శ్రీరెడ్డి ఎపిసోడ్ తర్వాత రాజకీయాల్లో రాణించాలంటే మీడియా అండ మెండుగా వుండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్ధం చేసుకున్నారు. అందుకే ముందు టీవీ 9 , abn చానెల్స్ మీద విరుచుకుపడినప్పటికీ దాంతో ప్రయోజనం లేదని గ్రహించి సొంత లేదా మద్దతుదారుల తో మీడియా సంస్థల్ని ఓన్ చేసుకోడానికి పూనుకున్నారు. అందులో భాగమే 99 ఛానల్ కొనుగోలు. సోషల్ మీడియాలోనూ ఇక నుంచి జనసేన వాణి బలంగా వినిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటితో పాటు ఓ పత్రిక సపోర్ట్ కూడా అవసరం అని పవన్ భావించారట. దాని ఫలితమే ప్రస్తుతం ఆంధ్రప్రభ నడిపిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త , రాజకీయ వేత్త ముత్తా గోపాలకృష్ణ జనసేన ప్రవేశానికి రంగం సిద్ధం కావడం.

 

ramoji-and-seenior-ntr
ఎన్టీఆర్ , రామోజీ కాంబినేషన్ 1982 లో రాజకీయాల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఈనాడు పత్రికారంగంలో , ఎన్టీఆర్ రాజకీయ రంగంలో కుదురుకోడానికి ఈ కాంబినేషన్ బాగా పని చేసింది. ఎన్టీఆర్ ఫోటోలు , ప్రచారం గురించి ఈనాడు లో ప్రముఖంగా ప్రచురించారు. దాంతో ఇబ్బడిముబ్బడిగా పత్రిక సర్క్యూలేషన్ పెరిగింది. తెలుగుదేశం పార్టీకి కావాల్సిన మద్దతు మీడియా పరంగా పెరిగింది. ఈ కాంబినేషన్ ఒక్క ప్రచారంతోటే ఆగిపోలేదు. పోలింగ్ కి ముందు ఈనాడు పత్రిక టీడీపీ కి మద్దతు ఇవ్వమని ఎడిటోరియల్ ద్వారా పిలుపు ఇచ్చింది. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఇక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఈనాడు వెల్లడించింది. జాతీయ స్థాయి వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ తెలుగు రాజకీయాల్లో మీడియా , రాజకీయాలు పరస్పరం ఎలా ఆధారపడి ఉన్నాయో ప్రజలకు బాగా అర్ధం అయిన సందర్భం అది. ఆ పై మీడియా , రాజకీయాల మధ్య అనుబంధం ఎంత ప్రగాడం అయ్యిందో అందరికీ తెలుసు.

mutta gopala krishna joining in pawan's party
ఇక ఇప్పుడు ముత్తా గోపాలకృష్ణ ని జనసేనలోకి ఆహ్వానించడం వెనుక కూడా అప్పటి ఎన్టీఆర్ , రామోజీ కాంబినేషన్ కూడా ఓ కారణం. ముత్తా గోపాలకృష్ణ నిజానికి రాజకీయంగా ఇప్పుడు అంత అవసరం అయిన స్థాయిలో ఏమీ లేరు. కానీ పవన్ ఆయన్ని పిలవడానికి కారణం ఆంధ్రప్రభ డైలీ తో పాటు ఆయన కుమారుడు పెడుతున్న ఇండియా ఎహెడ్ ఇంగ్లీష్ ఛానల్ అన్నది బహిరంగ రహస్యమే. దినపత్రికల్లో జనసేనకు అనుకూలంగా ఓ పత్రిక నడపాలన్న ఉద్దేశంతో పవన్ ఇప్పటికిప్పుడు ముత్తా కి ప్రాముఖ్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది.

senior-ntr-and-ramoji-rao

ముత్తా కూడా తనకు పవన్ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారని అనుకోలేదు. కానీ అనుకోనిది జరిగింది. అంతే కాదు. ఇప్పటికే 99 ఛానల్ కి పరోక్ష ప్రచారం చేస్తున్న జనసేన ఇప్పుడు ఆంధ్రప్రభ పత్రికని లిస్ట్ లోకి చేర్చింది. ఇదంతా జాగ్రత్తగా పరిశీలిస్తే మీడియా సహకారం కోసం పవన్ తాపత్రయం అర్ధం అవుతోంది. కానీ ఆయన ఒక్క విషయం మిస్ అవుతున్నారు. అప్పట్లో ఈనాడు చదవమని ఎన్టీఆర్ చెప్పలేదు. ఎన్టీఆర్ ని ఎన్నుకోమని ఈనాడు చెప్పింది. కానీ పవన్ మాత్రం ఆంధ్రప్రభ , 99 గురించి పబ్లిసిటీ చేయడం లో అర్ధం ఉందా ?