కౌశల్‌ కోసం ఛాన్స్‌తో బోయపాటి రెడీ…!

Boyapati Srinu Gives Movie Offer To Kaushal

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 మరో రెండు వారాల్లో పూర్తి కాబోతుంది. భారీ టీఆర్పీ రేటింగ్‌ దక్కించుకుని దూసుకు పోతున్న బిగ్‌ బాస్‌తో కౌశల్‌కు భారీగా గుర్తింపు దక్కింది. రెండవ వారం నుండి కౌశల్‌కు భారీ ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడిన విషయం తెల్సిందే. కౌశల్‌ ఆర్మీ అంటూ సోషల్‌ మీడియాలో ఫాం అవ్వడంతో పాటు పెద్ద ఎత్తున ఆ ఆర్మీ కార్యక్రమాలు జరుపుతున్న కారణంగా కౌశల్‌కు మరింతగా అభిమానులు పెరిగారు. కౌశల్‌కు పెరుగుతున్న అభిమానులను చూసి సినీ వర్గాల వారు కూడా షాక్‌ అవుతున్నారు. ఇక కౌశల్‌ ఆర్మీ ఈమద్య 2 కే రన్‌ నిర్వహించి మరింతగా కౌశల్‌పై తమకున్న అభిమానంను చాటుకోవడం జరిగింది.

boiapati-srinu

ఇలాంటి సమయంలో బిగ్‌బాస్‌ పూర్తి అయిన వెంటనే కౌశల్‌ను తమ సినిమాల్లో నటింపజేసేందుకు పలువురు దర్శకులు ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే కౌశల్‌ భార్య నీలిమతో చర్చలు కూడా జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. కౌశల్‌ డేట్లకు బోయపాటి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. బోయపాటి త్వరలో చేయబోతున్న సినిమాలో కౌశల్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.. ఇంకా పలువురు దర్శకులు కూడా కౌశల్‌ను తమ సినిమాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి కౌశల్‌ తనకు తెలియకుండానే స్టార్‌ అయ్యాడు.

kaushal-movies