సుమ మంచి మనసు.. దత్తతకు సిద్దం

Suma And Rajeev Kanakala Plans To Build Hospital In Kerala

కేరళలో భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయిన విషయం తెల్సిందే. ఎన్నో వేల కోట్ల ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం కూడా జరిగింది. కేరళలో జరిగిన విపత్తుకు భారీ ఎత్తున సాయం చేసేందుకు సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్‌ నుండి పెద్ద ఎత్తున ప్రముఖులు విరాళాలు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక తాజాగి బుల్లి తెర యాంకర్‌ సుమ తన మంచి మనసును చాటుకున్నారు. కేరళలో పుట్టి పెరిగిన సుమ తన సొంత ప్రాంతంను ఆదుకునేందుకు తన వంతు సాయంను ప్రకటించింది. అలప్పీలోని ఒక భవనంను దత్తత తీసుకుని బాగు చేయించేందుకు ముందుకు వచ్చారు.

kerala-foodss

కేరళ ప్రభుత్వం తాజాగా వరదల కారణంగా నాశనం అయిన భవనాలను దత్తత తీసుకుని బాగు చేయించేందుకు దాతలు ముందుకు రావచ్చు అంటూ ప్రకటించారు. దాంతో అలప్పీలోని ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్‌ భవనంను సుమ దంపతులు దత్తత తీసుకుని, దాన్ని మళ్లీ పాత రూపుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో మందికి ఆశ్రయం కల్పిస్తున్న ఫ్యామిలీ వెల్పేర్‌ బిల్డింగ్‌ను పూర్తిగా తమ సొంత ఖర్చులతో బాగు చేయించబోతున్నట్లుగా సుమ దంపతులు పేర్కొన్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే ఒక భవనంను దత్తత తీసుకుని బాగు చేయించవచ్చు అంటూ సుమ దంపతులు పేర్కొన్నారు.

suma And rajeev in kerala floods