“అఖండ” మ్యూజిక్ విషయంలో బోయపాటి ఊహించని కామెంట్స్……. !

“అఖండ” మ్యూజిక్ విషయంలో బోయపాటి ఊహించని కామెంట్స్....... !
Latest News

టాలీవుడ్ లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ మన అందరికీ తెలుసు . మరి వీరి కాంబినేషన్ నుంచి వచ్చిన రెండు భారీ హిట్స్ అనంతరం మూవీ తీశారు “అఖండ”.

అయితే ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే పెద్ద హిట్ కాగా ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఉన్న పలు కారణాల్లో సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన సెన్సేషనల్ స్కోర్ కూడా చాలా కీలక పాత్ర పోషించింది అని ఎవరిని అడిగినా చెప్పేస్తారు . కానీ అనూహ్యంగా ఈ విషయంలో బోయపాటి పలు ఊహించని కామెంట్స్ చేయడం ఇప్పుడు అందరికీ షాకింగ్ గా మారింది.

“అఖండ” మ్యూజిక్ విషయంలో బోయపాటి ఊహించని కామెంట్స్....... !
Boyapati Srinu

అఖండ లో ఆ సీన్స్ ని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా చూసినా కూడా అంతే హై లో అనిపిస్తాయి అని అంత పవర్ ఫుల్ గా ఆ సన్నివేశాలు తీసాం అన్నట్టుగా తెలియచేసారు . కానీ అక్కడ అసలు ఆ సన్నివేశాలకే ప్రాణం పోసి మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చిన థమన్ వర్క్ ని తగ్గించడం చాలా మందికి అసలు నచ్చలేదు. దీనితో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.