ఎట్రాక్టింగ్ గా ఉందని లవ్ చేసేయ్యకూడదు : `బ్రాండ్ బాబు` ట్రైలర్

Brand babu trailer

హీరోకి ఎదో ఒక రోగం పెట్టి నవ్వులు పూయించడంలో దిట్ట దర్శకుడు మారుతి. ఆయన ఇప్పుడు రోగాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నాడు. ‘భలే భలే మాగడివోయ్’ చిత్రంలో హీరోకి నానికి మతిమరుపు .. ‘మహానుభావుడు’ చిత్రంలో శర్వానంద్‌కు వోసీడీ (అతిశుభ్రం) ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌కి నాన్ స్టాప్ ఫన్ జోడించి హిట్లు కొట్టాడు మారుతి. మొత్తానికి మారుతి సినిమాలో హీరోకి ఓ లోపం ఉండటం, ఆ లోపాన్ని సరిదిద్దుకునేందుకు నానా కష్టాలు పడటం ఆయన సినిమాల్లో సరికొత్త స్టైల్‌గా మారింది. తాజాగా ఆయ‌న కధనందించిన ‘బ్రాండ్ బాబు’ అనే చిత్రం ట్రైలర్ ఇప్పుడు విడుదల అయ్యింది. ఈ మూవీ ట్రైలర్‌ను నేడు నాగ చైతన్య చేతుల మీదుగా విడుదల చేశారు.  సుమంత్ శైలేంద్ర (డెబ్యూ), ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి ఈటీవీ ప్ర‌భాక‌ర్‌ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో హీరోకి బ్రాండ్ అనే రోగం ఉంటుంది. బ్రాండ్ ఉన్న వస్తువుల్ని మాత్రమే ఇష్టపడే పాత్రలో సుమంత్ శైలేంద్ర కామెడీ పండిస్తున్నాడు. ట్రైలర్‌లోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసిన దర్శకుడు ‘బ్రాండ్ బాబు’ ప్రేక్షకులని ఏమాత్రం నవ్వించనున్నాడో మరి ?