బెంజ్ కారులో వచ్చి.. తుపాకీతో కాల్చుకుని

came in benz car and shoot himself

రంగారెడ్డి: జిల్లాలోని మంచిరేవుల వద్ద గుర్తుతెలియని ఓ వ్యక్తి తనను తాను తుపాకీతో కాల్చుకున్నాడు. తీవ్రగాయాలతో ఉన్న బాధితుడిని చికిత్స నిమిత్తం రాయదుర్గంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తి బెంజ్ కారులో వచ్చి ఓఆర్‌ఆర్‌పై ఆపి తుపాకీతో కాల్చుకున్నాడు. బాధితుడిని యూఎస్‌ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఫైజల్‌ అహ్మద్‌గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.