అసంతృప్తులకు చివరి అవకాశం

Chandra Babu Last chance To Leaders

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Chandra Babu Last chance To Leaders

రాజకీయాల్లో చంద్రబాబుది సెపరేట్ స్టైలే. ఆయన దేన్నైనా చాలా పద్ధతిగా డీల్ చేస్తారు. అది ఉపఎన్నిక అయినా, అసంతృప్తి అయినా, పార్టీ ఫిరాయింపు అయినా ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది. లెక్కలు కుదరందే చంద్రబాబు ఏ పనీ చేయరని పార్టీ నేతలకే కాదు అందరికీ తెలుసు. అయినా రాజకీయంగా విమర్శించాలి కాబట్టి విమర్శిస్తారు.

మొన్నటిదాకా పార్టీ ఫిరాయింపుల్ని పార్టీలో సెట్ చేయడంపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న అసంతృప్తుల్ని లైన్లో పెడుతున్నారు. ముందుగా ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడు జమ్మలమడుగు నియోజకవర్గ ఇంఛార్జ్ రామసుబ్బారెడ్డితో పని మొదలెట్టారు. రామసుబ్బారెడ్డి పార్టీకి వీరవిధేయుడు. చంద్రబాబు మాటను కాదనరు. అందుకే ఆయనకు ముందుగా అవకాశం వచ్చింది.

రామసుబ్బారెడ్డిని ఈజీగానే సెట్ చేసిన చంద్రబాబు.. మిగతా జిల్లాల్లో సీనియర్ల సంగతి చూడటానికి మీటింగులు ఫిక్స్ చేస్తున్నారు. శ్రీకాకుళం గౌతు శ్యాంసుందర్ శివాజీ, ప్రకాశం జిల్లా కరణం బలరాం, దివి శివరాం, మరో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా బాబును త్వరలో కలవబోతున్నారు. వీరికి వచ్చిన ఆందోళన ఏమీ లేదని, అందరికీ సమ న్యాయం చేస్తారని బాబు చెప్పి.. సెట్ రైట్ చేయబోతున్నారు.