బాబు గొప్పతనమేంటో కేటీఆర్ కు తెలిసొచ్చింది

Sanjay Lal Bhai Praised Chadrababu Government Rule

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Sanjay Lal Bhai Praised Chadrababu Government Rule

హైదరాబాద్ కు చంద్రబాబు చేసిందేమీ లేదు.. అంతా నిజాం గొప్పతనమే అని డబ్బా కొడుతున్న కేటీఆర్ కు మోడీ ఇలాకాలో దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. చంద్రబాబు గొప్పతనమేంటో పరాయి రాష్ట్రంలో వినాల్సి రావడం ఆయనకు కాస్త ఇబ్బందిగానే అనిపించింది. సీనియర్ ఎప్పటికైనా సీనియరేనని, కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సదరు వ్యాపారవేత్త కేటీఆర్ కు ఇన్ డైరక్ట్ గా షాకిచ్చినట్లుగా అనిపించింది.

గుజరాత్ గాంధీనగర్ లో జరిగిన అంతర్జాతీయ టెక్స్ టైల్ సమ్మిట్ కు మోడీతో సహా చంద్రబాబు, కేటీఆర్ హాజరయ్యారు. కానీ కేటీఆర్ మాత్రం షరా మామూలుగా తమ డబ్బా మాత్రమే కొట్టుకున్నారు. కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు మాత్రం టెక్స్ టైల్ రంగంలో వస్తున్న మార్పుల్ని ఉదాహరణలతో సహా వివరించడంతో అక్కడ కూర్చున్న వ్యాపారులకు కూడా ఆశ్చర్యం కలిగించింది.

వీరిద్దరి ప్రెస్ మీట్ల తర్వాత అరవింద్ గ్రూప్ ఎండీ, ఛైర్మన్ సంజయ్ లాల్ భాయ్ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశమైంది. చాలా సంవత్సరాల క్రితం నేను చంద్రబాబును కలిశాను, ఆయనకు నేను గుర్తుండి ఉండకపోవచ్చని ఆయన చెప్పడం.. అక్కడకు వచ్చిన అందరి సీఎంలకు షాకిచ్చింది. బాబు పాలనా దక్షత అంటే తనకు చాలా ఇష్టమని ఆయన చెప్పడంతో అక్కడే ఉన్న కేటీఆర్ ఉడుక్కున్నారు.