తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి శాడిజం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి శాడిజం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి శాడిజం తాజాగా మరొకసారి బయటపడింది. అయితే సాధారణంగా శాసన సభలో ఆమోదం పొందినటువంటి బిల్లులను మండలిలో కూడా మాములుగా గెలిపించడమో లేక అడ్డుకోవడమో జరుగుతుంది. కానీ వేరే ఏ ఇతర కమిటీకి పంపాల్సిన అవసరం లేదు. కానీ తాజాగా ఇలాంటి సందర్భంలో మాత్రం శాసన మండలిలో బిల్లులపై ఎలాంటి చర్చలు జరగకుండా, ఎలాంటి ఓటింగ్ జరగకుండా ఇతర సెలక్ట్ కమిటీకి పంపించారు. దానికి తోడు ఓటింగ్ ద్వారా కాకుండా చైర్మన్ ఇలా ప్రవర్తించడం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి.

అయితే అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం-2020, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై అసెంబ్లీ రెండు రోజుల పాటు చర్చ జరిపి, ఓటింగ్ మెజారిటీ కారణంగా బిల్లులపై ఎలాంటి చర్చలు జరగకుండానే రెండు రోజులు పెండింగ్ లో ఉంచి, చివరికి కమిటీ ఛైర్మన్ని మ్యానేజ్ చేసి ఏకపక్షంగా సెలక్ట్ కమిటికి పంపేసింది. అయితే ఇదంతా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని సంతృప్తి పరచడానికి అని తెలుస్తుంది. దానికి కారణం లేకపోలేదు. కొన్ని సంవత్సరాలపాటు టీడీపీ లో పనిచేస్తున్న షరీఫ్ ని ఎమ్మెల్సీ ని చేసి మండలి చైర్మన్ ని చేసింది చంద్రబాబే.

అయితే చంద్రబాబు గారి వల్లే తనకి ఈ పదవి వచ్చిందని, తనని ప్రభావితం చేయడానికే అసెంబ్లీలో ఉండాల్సిన చంద్రబాబు మండలి గ్యాలరీలోకి వచ్చి, అలా కూర్చున్నారు. అయితే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని అందరు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల సీఎం జగన్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల నిర్మాణాలను అడ్డుకోలేకపోతున్న చంద్రబాబు ఇలాంటి తన రాజకీయ శాడిజాన్ని బయటపెట్టారని వార్తలు వస్తున్నాయి.