రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్

రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్

ప్రస్తుతానికి రాజకీయాలతో బిజీగా గడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి, షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. బాలీవుడ్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు మరియు బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా నివేధా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సామజిక మాంద్యమాల్లో వైరల్ గా మారింది… కాగా రాజకీయాలతో మునిగిపోయిన పవన్ ఈ సినిమా కోసమని కేవలం 30 రోజులు మాత్రమే సర్దుబాటు చేశారు. కాగా హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రతిరోజూ షూటింగ్‌ ఉంటున్న నేపథ్యంలో, పవన్ కి సమయాన్ని సర్దుబాటు చేయడానికి నిర్మాత దిల్ రాజు ఒక ప్రత్యేక విమాన సదుపాయాన్ని కల్పించారని, ఈ మేరకు ఇప్పటికే దిల్ రాజు ఒక విమానయాన సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని సమాచారం. అందుకని కోటి రూపాయలు ఖర్చు చేశారని వినిపిస్తుంది.