ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వైసీపీ ప్రభుత్వం

ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వైసీపీ ప్రభుత్వం

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండలిలో జరిగిన అసలు విషయాన్ని బయటకు తెలుపుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు. శాసనమండలిలో ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు చర్చ జరిగేటప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో లోపల ఏం జరిగింది అనేది నారా లోకేశ్ లేఖలో పేర్కొన్నారు. దేవాలయం లాంటి శాసన మండలిలో ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. వైసీపీ మంత్రులు గుండాల మాదిరి వ్యవహరించారని అన్నారు.

అయితే 2014 రాష్ట్ర విభజనను ఎంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా పార్లమెంట్ తలుపులు మూసి, లైవ్ టెలికాస్ట్ ఆపి వేసి, ఏపీ ఎంపీలపై దాడి చేసి మూకబలంతో బిల్లు తెచ్చారో. అదే విధమైన దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చోటు కూడా చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇటువంటి దౌర్జన్యపూరిత సంఘటనలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడటం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పారు. మండలిలో సభ్యులు కానీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలపై దాడులకు దిగారని అన్నారు.

మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేసి, ఇంటర్‌నెట్ సేవలు ఆపేశారు. కరెంట్ కట్ చేశారు. ఇటువంటి సమయంలో గౌరవ అధ్యక్ష స్థానంలో ఉన్న షరీఫ్ వైపు ఒక్కసారిగా వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు దూసుకొచ్చి ఛైర్‌ని చుట్టుముట్టారు. ఛైర్మన్‌ను అంతు చూస్తామని బెదిరించారు. ఇతర టీడీపీ సభ్యులపైనా మూకుమ్మడిగా దాడి చేశారు. మండలి సభ్యుడిగా ఫోన్‌లో ఎటువంటి వీడియోలు చిత్రీకరించకూడదు కానీ ఛైర్మన్, ఇతర ఎమ్మెల్సీల భద్రత కోసం తప్పని సరై నేను వీడియో తీయాల్సి వచ్చింది. విలువలు, విశ్వసనీయత అంటూచెప్పే సీఎం జగన్ తమ వైసీపీ మంత్రులు మండలిలో ఎలా ప్రవర్శించారో ప్రజల ముందుంచే ప్రయత్నమే ఇది అంటూ లేఖతో పాటు వీడియోను కూడా పోస్ట్ చేశారు.