నేను ఇప్పుడు బాగానే ఉన్నాను : ప్రముఖ నటుడు సునీల్

నేను ఇప్పుడు బాగానే ఉన్నాను : ప్రముఖ నటుడు సునీల్

ప్రముఖ నటుడు సునీల్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని, సునీల్ ఆసుపత్రి పాలయ్యాడని ఉదయం నుండి వచ్చిన వార్తలతో అభిమానులందరూ కూడా తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. సునీల్ కి ఏమైంది, ఎందుకిలా ఆరోగ్యం క్షీణించింది అని సినీ వర్గాలు కూడా కంగారు పడిపోయారు. ఈ తరువాత మెల్లమెల్లగా సునీల్ ఆరోగ్యానికి సంబందించిన కొన్ని కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అయితే గత కొంత కాలంగా సునీల్ లివర్ సమస్యతో బాధపడుతున్నాడని, దానికి తోడు వైరల్ ఫీవర్ రావడంతో వైద్యుల సూచన మేరకు నటుడు సునీల్ ఆసుపత్రిలో చేరిపోయారు.

అయితే ఎట్టకేలకు సునీల్ తన ఆరోగ్య విషయంలో తన అభిమానులందరికి ఒక క్లారిటీ ఇచ్చారు. తనకు ఏం కాలేదని, ఇపుడు బాగానే ఉన్నానని చెప్పుకున్నారు. అంతేకాకుండా తన ఆరోగ్య విషయానికి సంబంధించి సునీల్ ఒక పోస్టు కూడా పెట్టారు. “నా గురించి ఇంతగా ఆలోచించిన నా శ్రేయోభిలాషులందరికీ థ్యాంక్స్.. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను.. ఏం కంగారు లేదంటూ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసాడు. దాంతోపాటు డిస్కో రాజా థియేటర్స్‌లోకి వస్తుంది ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు” సునీల్…