స్టైలీష్ క‌థ‌ల‌తోనే ఎక్కువ‌గా ప్ర‌యాణం చేస్తున్న మ‌హేష్‌బాబు

స్టైలీష్ క‌థ‌ల‌తోనే ఎక్కువ‌గా ప్ర‌యాణం చేస్తున్న మ‌హేష్‌బాబు

ఈమ‌ధ్య మ‌హేష్‌బాబు స్టైలీష్ క‌థ‌ల‌తోనే ఎక్కువ‌గా ప్ర‌యాణం చేస్తున్నాడు. శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి… మొన్న‌టి `స‌రిలేరు నీకెవ్వ‌రు..` ఈ సినిమాల‌న్నీ ఈ కోవ‌లోకే వ‌స్తాయి. హెలీకాఫ‌ర్లు, చాప‌ర్లు ఎడా పెడా వాడేసేంత బిలియ‌నీర్ పాత్ర‌ల‌లోనే మ‌హేష్ క‌నిపిస్తున్నాడు. ఇప్పుడ మ‌రోసారి అలాంటి పాత్ర‌లోనే ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు. మ‌హేష్ – వంశీ పైడిప‌ల్లి కాంబోలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఏప్రిల్‌, మేల‌లో చిత్రీక‌ర‌ణ మొద‌లెడ‌తారు.

సాధార‌ణంగా… వంశీ పైడిప‌ల్లి సినిమాల‌న్నీ భారీ హంగుల‌తోనే ఉంటాయి. స్టైలీష్ మేకింగ్ అంటే వంశీకి ఇష్టం. ఈసారీ అలాంటి క‌థే రాసుకున్నాడ‌ని తెలుస్తోంది. మ‌హేష్ కోసం ఓ స్టైలీష్ స్పై థ్రిల్ల‌ర్ డిజైన్ చేశాడ‌ట‌. ఈ సినిమా హాలీవుడ్ జేమ్స్‌బాండ్ త‌ర‌హాలో సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ త‌ర‌హా పాత్ర‌లంటే మ‌హేష్‌కి చాలా ఇష్టం. కృష్ణ కూడా `జేమ్స్ బాండ్ త‌ర‌హా పాత్ర‌ల‌లో మ‌హేష్‌నిచూడాలి` అని త‌ర‌చూ చెబుతుండేవారు. `స్పైడ‌ర్‌`లో ఇలాంటి పాత్రే పోషించాడు మ‌హేష్‌. కానీ ఫ‌లితం రాలేదు. ఈసారి మాత్రం ప‌క్కా ప్లానింగ్‌తో, ప‌కడ్బందీగా రాబోతున్నాడు. అస‌లే వ‌రుస హిట్స్‌తో దూకుడుమీదున్నాడు మ‌హేష్‌. ఈసారి త‌న గురి త‌ప్ప‌క‌పోవొచ్చు.