త‌మిళ సినిమాల‌వైపు చ‌ర‌ణ్ దృష్టి

త‌మిళ సినిమాల‌వైపు చ‌ర‌ణ్ దృష్టి

ధృవ సినిమాని రీమేక్ చేసి ఓ హిట్టు కొట్టాడు రామ్ చ‌ర‌ణ్‌. అప్ప‌టి నుంచీ త‌మిళ సినిమాల‌వైపు చ‌ర‌ణ్ దృష్టి సారిస్తూనే ఉన్నాడు. తాజాగా `హీరో`పై చ‌ర‌ణ్ క‌న్ను ప‌డింది. శివ‌కార్తికేయ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. విడుద‌ల‌కు ముందే ఈ సినిమా గురించి తెలుసుకున్న చ‌ర‌ణ్‌.. రీమేక్‌, డ‌బ్బింగ్ రైట్స్‌ని హోల్డ్ చేశాడ‌ట‌. ఈ సినిమాని చ‌ర‌ణ్ రీమేక్ చేయొచ్చు, లేదంటే డబ్ చేసి వ‌ద‌లొచ్చు.

రెండింటిలో ఏదైనా జ‌ర‌గొచ్చు. రీమేక్ చేస్తే ఓ రేటు, కేవ‌లం డ‌బ్బింగ్‌కే ప‌రిమిత‌మైతేఉ మ‌రో రేటు ఇస్తాన‌ని నిర్మాత‌ల‌కు చ‌ర‌ణ్ మాటిచ్చాడ‌ట‌. సూప‌ర్ హీరో కావాల‌నుకునే ఓ క‌థానాయ‌కుడి క‌థ ఇది. శ‌క్తిమాన్‌ని చూసి, సూప‌ర్ హీరోలా విన్యాసాలు చేయాల‌నుకుంటాడు హీరో. మ‌రి త‌న కోరిక ఎలా నెర‌వేరింద‌న్న ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌తో ఈ సినిమాని తెర‌కెక్కించారు. నిజానికి తెలుగులోనూ ఈసినిమాని డ‌బ్ చేసి విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. రీమేక్ చేయ‌డానికి చ‌ర‌ణ్ ఆస‌క్తి చూపించ‌డంతో డ‌బ్బింగ్ ప‌నులు ఆపేశారు.