చిరు ముందు అఖిల్ ఆటలు సాగేనా..?

Akhil Hello movie Pre release Function

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని వారసుడు ‘అఖిల్’ కథానాయకుడిగా కళ్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం హలో!… ఇప్పటికే విడుదల అయిన టీజర్, ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22 న అత్యధిక ధియేటర్ లో రిలీజ్ కాబోతుంది. అఖిల్ హలో! చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు, మొదటి చిత్రం ప్లాఫ్ అవ్వడంతో ఈ సినిమా పై అఖిల్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు.

హలో! కోసం అఖిల్ విపరీతమైన ప్రమోషన్ చేస్తున్నాడు… ఎన్నడులేని విధంగా అఖిల్ వరుసగా లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ , లైవ్ సాంగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు… ఇప్పటికే వైజాగ్ లో ఆడి, పాడాడు. ఆ వెంటనే అమెరికా లో కుడా అలుపులేకుండా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి నేరుగా హైదరాబాద్ లో ప్రీ- రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతున్నాడు. బుధవారం జరగబోయే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ ఈవెంట్ లోనూ అఖిల్ ఆట, పాట ఉంటుందట. ఈ ఈవెంట్ కి చిరు వస్తుండడంతో అఖిల్ చాలా బాగా హర్డ్ వర్క్ చేస్తున్నాడు. అందుకోసం అఖిల్ బాగా రిహార్సల్స్ చేస్తున్నాడట. మొత్తానికి తన సినిమాను ప్రమోట్ చేసే విషయంలో అఖిల్ ఎక్కడా రాజీ పడకుండా కష్టం పడుతున్నాడు.