Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానం ఉందో తన పెళ్లిలో చిరు ప్లెక్సీ పెట్టుకోవడం ద్వారా చూపించాడు ఆకుల భాస్కరరావు. ఇటీవల భాస్కర్ వివాహం చేసుకున్నాడు. ఆ వివాహంను చిరంజీవి సమక్షంలో చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పెద్ద పెక్సీ పెట్టి, దాని ముందు పెళ్లి చేసుకోవడంతో ఆ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరంజీవి సైతం ఆకుల భాస్కర్ అభిమానంకు ముగ్దుడు అయ్యాడు. తన ఫొటో పెట్టుకుని పెళ్లి చేసుకున్న భాస్కర్‌పై చిరంజీవికి మనస్సు అయ్యింది. వెంటనే ఆ అభిమానిని చూడాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా భాస్కర్‌కు సమాచారంను తనవారి ద్వారా అందించాడు.
చిరంజీవి నూతన దంపతులను తన ఇంటికి ఆహ్వానించాడు. వారితో సరదాగా మాట్లాడటంతో పాటు, వారితో కలిసి భోజనం చేసి వారిని సంతోష పెట్టాడు. కొత్త దంపతులను అభినందించి, వారికి ప్రత్యేక కానుకలు అందించాడు. చిరంజీవి ఇంట్లో దక్కిన గౌరవంతో ఫ్యాన్ భాస్కర్ ఉబ్బి తబ్బిబవుతున్నాడు. చిరంజీవి గారు ఇచ్చిన మెగా గిఫ్ట్‌ను జీవితంలో మర్చిపోను అంటూ భాస్కర్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. చిరంజీవి ఇలా అభిమానికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి, తన ఇంటికి ఆహ్వానించి, వారితో కలిసి భోజనం చేయడంను ఫ్యాన్స్‌తో పాటు ఇతరులు అంతా కూడా అభినందిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవితో భాస్కర్ దంపతులు కలిసి తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.