చిరంజీవి మెచ్చుకున్నాడట

chiranjeevi next Movie Director In Prasanth Varma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పలు సినిమాల్లో యువ దర్శకులు, దర్శకుడిగా ఎదగాలని తాపత్రయ పడే వారు ఎలా ఇబ్బందులు పడతారో చూపించడం జరిగింది. అంతకు రెట్టింపు కష్టాలను యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అనుభవించాడు. సీనియర్‌ దర్శకుల చీత్కారాలు, ఈసడిప్పులు, తిట్లు ఇలా అనేక రకాలుగా ప్రశాంత్‌ వర్మ ఇబ్బందులు ఎదుర్కోన్నాడు. ఎట్టకేలకు నాని ఛాన్స్‌ ఇవ్వడంతో ‘అ!’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించిన దర్శకుడు ప్రశాంత్‌ తాజాగా మెగాస్టార్‌ చిరంజీవికి కథ చెప్పడం జరిగిందట. ఆమద్య చిరంజీవి, బాలకృష్ణలతో ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయాలనుంది అంటూ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్‌ ఇప్పుడు చిరంజీవి ప్రశంసలు దక్కించుకుని మరోసారి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచాడు.

దర్శకుల వద్ద ప్రతిభ ఉన్నా కూడా దాన్ని కొందరు బయట పెట్టలేరు. కొందరు దర్శకులు మాత్రమే తాము అనుకున్న కథను చెప్పడంలో కాని, చూపించడంలో కాని సక్సెస్‌ అవుతారు. కొందరు కథ బాగా చెప్పలేక పోయినా సినిమా బాగా తీస్తారు. కాని ప్రశాంత్‌ వర్మ మాత్రం కథ చెప్పడంలో సినిమా చూపించినంత అనుభూతిని కలిగిస్తాడట. ఈ విషయాన్ని గతంలో నాని కూడా అన్నాడు. తాజాగా చిరంజీవి కూడా ఈ విషయమై స్పందించాడని తెలుస్తోంది. తనకు ఇప్పటి వరకు కథలు చెప్పిన దర్శకుల్లో అయిదుగురు అద్బుతంగా కథలు చెప్పారు. వారిలో నువ్వు ఒక్కడివి అంటూ ప్రశాంత్‌ వర్మను చిరంజీవి పొగడ్తలతో ముంచెత్తినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రశంసతో ఈ యువ దర్శకుడి స్థాయి అమాంతం పెరిగి పోయింది. త్వరలోనే ఈయన చిరంజీవితో ఒక సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.