చిరు క్లీన్‌ షేవ్‌.. సైరా ఆగిపోయింది

Chiranjeevi Shave off His Beard because of Sye Raa Shooting Cancel

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది. దాదాపు పది రోజుల పాటు షూటింగ్‌ జరిగిన తర్వాత మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. త్వరలో రెండవ షెడ్యూల్‌కు వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ సమయంలో సోషల్‌ మీడియాలో ‘సైరా’ చిత్రం ఆపేశారని, మొదటి షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత చిరంజీవి సంతృప్తి చెందక పోవడంతో ముందే వదిలేయడం మంచిదనే ఉద్దేశ్యంతో సినిమాను వదిలేసినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం కోసం దాదాపు మూడు నెలల పాటు గడ్డం పెంచిన విషయం తెల్సిందే. అయితే షూటింగ్‌ ప్రారంభం అయ్యి ఒక్క షెడ్యూల్‌ అవ్వగానే చిరంజీవి గడ్డం తీసి క్లీన్‌ షేవ్‌తో కనిపించాడు.

Chiru-Sye-Raa-Shooting

సినిమా కోసం గడ్డం పెంచిన చిరంజీవి దాన్ని తీసేశాడు అంటూ ఖచ్చితంగా సినిమాను వదిలేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇలా గడ్డం తీసేశాడు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ విషయంపై స్పందిస్తున్నారు. ఎక్కువ శాతం మీడియా జనాలు మరియు సినీ వర్గాల వారు మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. చిరంజీవి సైరా చిత్రాన్ని వదిలేయడని, కొత్త షెడ్యూల్‌ కోసం గడ్డం తీసి ఉంటాడని, పాత్ర కోసం చిరంజీవి గడ్డం తీసి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి గడ్డం తీసేయడంతో ఒక పెద్ద పుకారు మొదలైంది. ఆ పుకారుపై చిత్ర యూనిట్‌ సభ్యులు ఎవరైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.