ఆత్మ సాక్షిగా ఆమె బిడ్డ లాంటిది… కాదు సాక్ష్యాలున్నాయి.

police says we have all evidences ghazal Sexual Harassment srinivas case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గజల్ శ్రీనివాస్ వివరణకు, పోలీసుల వాదనకు మధ్య ఎంతో తేడా. శ్రీనివాస్ మీద ఫిర్యాదు చేసిన కుమారి ఇచ్చిన ఆడియో, వీడియో క్లిప్ ల సాక్ష్యాలు పరిశీలించాకే ఆయన్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం ఆత్మసాక్షిగా నేనే తప్పు చేయలేదని వాదిస్తున్నారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం. ఆమెని కూడా ఓ బిడ్డలాగా భావించా. అలాంటి అమ్మాయిని వేధించాననడం అవాస్తవం. ఆమె నాకు మసాజ్ చేసింది నిజమే కానీ అందులో నా తప్పు లేదు. ఇటీవల ఓ యాక్సిడెంట్ లో గాయపడ్డందున కొన్నాళ్లుగా ఫిజియో థెరపీ చేయించుకుంటున్నా. ఆ రోజు ఫిజియో థెరపిస్ట్ రాకపోవడంతో ఆ అమ్మాయి వద్దన్నా వినకుండా మసాజ్ చేసింది. ఆ వీడియో అడ్డుపెట్టుకుని ఇప్పుడు కేసు పెట్టింది. ఆ అమ్మాయి మీద కలలో కూడా తప్పుడు ఉద్దేశం లేదని గజల్ శ్రీనివాస్ అంటున్నారు.