చిరు మరోలుక్‌… సైరా కోసమేనా?

Chiru New look For Sye Raa Narasimha Reddy

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం దాదాపు మూడు నాలుగు నెలల పాటు గడ్డంను పెంచిన విషయం తెల్సిందే. చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తి అవ్వగానే చిరంజీవి ఆ గడ్డంను తొలగించేసి కొత్త సంవత్సరం నాడు కనిపించాడు. గడ్డం తీసేయడంతో అంతా కూడా అవాక్కయ్యారు. చినంజీవి గడ్డం తీసేయడంతో ‘సైరా’ చిత్రం ఆగిపోయిందని కొందరు. కాస్త ఆలస్యంగా రెండవ షెడ్యూల్‌ మొదలు కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇక తాజాగా మరోసారి చిరంజీవి పూర్తి నీట్‌ షేవ్‌తో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఒక సినీ వేడుకలో పాల్గొన్న చిరంజీవి కొత్త గెటప్‌లో కనిపించాడు.

పూర్తి నీట్‌ షేవ్‌తో కనిపించిన చిరంజీవి, గతంతో పోల్చితే కాస్త లడ్డుగా అనిపించాడు. ఈ లుక్‌ చాలా బాగుందని, సైరా కోసం చిరంజీవి ఇలా మారి ఉంటాడు అంటూ కొందరు అంచనా వేస్తున్నారు. హెయిర్‌ కూడా గతంతో పోల్చితే చాలా తగ్గించాడు. వచ్చే నెలలో సైరా రెండవ షెడ్యూల్‌ తమిళనాడులోని పొల్లాచ్చిలో ప్రారంభం కాబోతుంది. అందుకోసం చిరంజీవి న్యూ ుక్‌తో రెడీ అయ్యడు అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి చిరంజీవి బయటకు వచ్చిన ప్రతి సారి ఒక్కో విధంగా కనిపిస్తూ అభిమానులను మరియు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చరణ్‌ నిర్మిస్తున్న సైరా చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉం