జక్కన్న మల్టీస్టారర్‌లో మహేష్‌ ఉంటే?

Cinema Fans Felling Mahesh Babu To Act In Rajamouli Multi starer Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రం మల్టీస్టారర్‌ అనే విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లతో జక్కన్న సినిమా తీయబోతున్నాడు. వీరిద్దరు మంచి స్నేహితులు అవ్వడంతో జక్కన్న ప్రపోజల్‌కు వెంటనే ఓకే చెప్పారు. ఒక మంచి స్టోరీ లైన్‌తో ప్రస్తుతం స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు గతంలో పలు సందర్బాల్లో కలుసుకున్నారు, ఒకరి వేడుకల్లో ఒకరు పాల్గొన్నారు. అయితే ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించడం అనేది మాత్రం సంచలనంగా చెప్పుకోవచ్చు. భారీ అంచనాలనున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు కూడా ఉంటే బాగుంటుందనే అభిప్రాయంను ప్రస్తుతం కొందరు సోషల్‌ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. 

గత కొన్ని వారాలుగా మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు తెగ కలుస్తున్నారు. వీరు ముగ్గురు ఈ మద్య పదే పదే కలుసుకోవడం వల్ల జక్కన్న మల్టీస్టారర్‌లో మహేష్‌బాబు కూడా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఫుల్‌ లెంగ్త్‌ పాత్ర కాకున్నా కనీసం గెస్ట్‌ రోల్‌లో అయినా మల్టీస్టారర్‌లో మహేష్‌ కనిపిస్తే చరిత్ర సృష్టించడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. అయితే అది సాధ్యం అవ్వడం అంత సులభం కాదని, అది అయ్యే పని కాదని సినీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి మల్టీస్టారర్‌లో మహేష్‌ అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న మల్టీస్టారర్‌ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ అక్టోబర్‌లో మొదలు పెట్టే అవకాశాలున్నాయి.