సీఎం జగన్‌కి షాక్ ఇచ్చిన టీడీపీ నేతలు

సీఎం జగన్‌కి షాక్ ఇచ్చిన టీడీపీ నేతలు

ఏపీ సీఎం జగన్‌కి టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ నలుగురు టీడీపీ నేతలు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, పల్లా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీసీలకు రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల 15వేల మంది నాయకులు నష్టపోతారని పిటీషన్‌లో పేర్కొన్నారు.

అయితే బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం సీఎం జగన్‌దే అని ఆరోపించారు. వైసీపీ నేతలు, జగన్ సన్నిహితులు కలిసి బీసీ రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి రావడానికి బీసీలు సహకరిస్తే ఇప్పుడు వారికే వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. సొంత కేసులకు కోట్ల రూపాయలు చెల్లించి లాయర్లను పెట్టుకున్న జగన్, బీసీల కేసులో ఎందుకు సమర్ధుడైన లాయర్‌ని నియమించలేదో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 176 ను యధాతథంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.