కలర్స్ స్వాతి పెళ్లి కుదిరిందోచ్.

Colours Swathi To Marry A Pilot

టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నప్పటికీ ఆ స్థాయిలో పేరు , అవకాశాలు రాని తెలుగు హీరోయిన్స్ లిస్ట్ లో కలర్స్ స్వాతి పేరు ముందుంటుంది. సినిమాల సంగతి ఎలా వున్నా లేనిపోని పుకార్లతో ఆమె పేరు ముందుకు వచ్చిన సందర్భాలు లేకపోలేదు. మొదట్లో ఇలాంటి వాటికి బాగా ఇబ్బందిపడ్డ స్వాతి పరిశ్రమ రంగు ,రుచి, వాసన తెలిసాక అలాంటి వాటి ని పట్టించుకోవడం మానేసింది. తాజాగా ఆమె గురించి ఇంకో కబురు బయటకు వచ్చింది. అదే స్వాతి పెళ్లి కబురు .ఈసారి స్వాతి గురించి వచ్చిన కబురు వట్టిది కాదు గట్టిదే అని తెలుస్తోంది. ఆమె పెళ్లి కుదిరిందట. వరుడు వికాస్ అని విమానం నడిపే పైలట్. ఈ నెల 30 న హైదరాబాద్ లో వీరి పెళ్లి ముహూర్తం కుదిరిందట. కొచ్చిన్ లో వచ్చే నెల రెండున రిసెప్షన్ అంటున్నారు.

Colours Swathi To Marry A Pilot
పెళ్లి తర్వాత స్వాతి సినిమాల్లో చేస్తుందా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇక హీరోయిన్ పెళ్లి అనగానే అందరికి ముందుగా వచ్చే డౌట్ అది లవ్ మ్యారేజ్ ? లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అన్న ఊహాగానాలు సహజమే. స్వాతి పెళ్లి లవ్ కం అరేంజ్డ్ అని అంటున్నారు. ఇందులో నిజమెంతో అనేది పెళ్లికూతురు బయటకు చెపితే గానీ తెలియదు. అయితే ఈ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడానికి ఆమె ఒప్పుకున్నప్పటికీ స్వాతి తో సినిమా అనుకునే ఫిలిం మేకర్స్ కి ఓ ఇబ్బంది తప్పదు. ఎందుకంటే స్వాతి కాబోయే భర్త పని చేసేది మలేసియాన్ ఎయిర్ లైన్స్ లో.ఉండేది జకార్తాలో. పెళ్లి తర్వాత స్వాతి ఎక్కడ ఉంటుందో మరి ?

Colours Swathi To Marry A Pilot