టాలీవుడ్ నటుడు విజయ్ ఆత్మహత్య.

Comedian Vijay Sai commits Suicide in Hyderabad

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ లో ఓ విషాద ఘటన జరిగింది. అమ్మాయిలు అబ్బాయిలు, బొమ్మరిల్లు సహా వివిధ సినిమాల్లో నటించిన విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. యూసఫ్ గూడ లోని ఓ అపార్ట్ మెంట్ లో విజయసాయి ఆత్మహత్య చేసుకున్నాడు. సినీ రంగంలో తాను అనుకున్నట్టు అవకాశాలు రాకపోవడంతో కొన్నాళ్లుగా విజయ్ సాయి తీవ్ర ఆవేదన చెందుతున్నారట. అదే డిప్రెషన్ లో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

యువ కమెడియన్స్ పెద్ద ఎత్తున సినీ రంగంలోకి రావడంతో విజయ్ సాయి కెరీర్ మీద ఆ ప్రభావం బాగా పడిందట. దీన్ని ఎదుర్కోడానికి విజయ్ సాయి గట్టి ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో విజయ్ సాయి ఇంత కఠిన నిర్ణయం తీసుకుని ఉంటారని అనుకుంటున్నారు. అయితే సినీ రంగంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఎగుడుదిగుళ్లు వున్నాయి. విజయ్ దాంపత్య జీవితంలో ఇబ్బందులు తలెత్తి ఆయన భార్యతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక భార్య దగ్గర ఉంటున్న కూతురిని చూసే అవకాశం లేకపోవడం తో విజయ్ సాయి బాగా కుంగిపోయాడట . అదే సమయంలో సినిమా ఛాన్స్ లు కూడా తగ్గడంతో అన్ని విధాలుగా మానసికంగా కుంగిపోయిన విజయ్ సాయి ఇలా చేసుకున్నారు.