పోలీసుల‌కు లొంగిపోయిన వ‌నితారెడ్డి

Vijay Sai Wife Vanitha Reddy Surrendered

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కొన్నిరోజులుగా తప్పించుకుతిరుగుతున్న దివంగ‌త క‌మెడియ‌న్ విజ‌య్ సాయి భార్య వ‌నితారెడ్డి పోలీసుల‌కు లొంగిపోయారు. ఆమెను అదుపులోకి తీసుకున్న హైద‌రాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో విజ‌య్ త‌న భార్య‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. భ‌ర‌ణం కోసం వ‌నిత త‌న‌ను వేధించిన‌ట్టు ఆరోపించారు. దీంతో వ‌నిత‌పై పోలీసులు కేసు న‌మోదుచేశారు. అయితే ఆత్మ‌హ‌త్య విష‌యం బ‌య‌ట‌కి వ‌చ్చిన రోజు మీడియా ముందుకు వ‌చ్చిన వ‌నిత భ‌ర్త‌పై అనేక ఆరోప‌ణ‌లు చేశారు.

విజ‌య్ కు ఇత‌ర మ‌హిళ‌ల‌తో వివాహేత‌ర సంబంధాలు ఉన్నాయ‌ని, ఆయ‌న‌కు హెచ్ ఐవీ కూడా ఉంద‌ని ఆరోపించారు. ఆ త‌ర్వాత మాత్రం వ‌నిత క‌నిపించ‌కుండా పోయారు. భ‌ర్త అంత్య‌క్రియ‌ల‌కు కూడా ఆమె హాజ‌రుకాలేదు. అప్ప‌టినుంచి ప‌రారీలో ఉన్న వ‌నిత తాజాగా… పోలీసుల ముందు స‌రెండర్ అయ్యారు. విజ‌య్ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ప‌లు ఆధారాలు పోలీసుల‌కు స‌మ‌ర్పించ‌బోతున్న‌ట్టు అంత‌కుముందు ఆమె మీడియాకు చెప్పారు. పోలీసులు స‌రెండ‌ర్ కావాల‌ని నోటీసులు ఇచ్చార‌ని, అందుకే పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చామ‌ని తెలిపారు.